పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌దే హవా.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజ

  •  అత్యధిక స్థానాల్లో ముందంజలో హస్తం పార్టీ అభ్యర్థులు
  • మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి ముందంజ
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నల్గొండ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉండగా, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.

భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో నాగరాజు, ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఆదినారాయణ, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. 

Telangana Assembly Election
Revanth Reddy
Komatireddy Venkat Reddy
Khammam District
Kodangal
Congress
BRS
BJP

More Telugu News